‎K Ramp Trailer: హీరో కిరణ్ అబ్బవరం K ర్యాంప్‌ ట్రైలర్ రిలీజ్.. వీడియో వైరల్!

‎K Ramp Trailer: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. మొదట రాజా వారు రాణి గారు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ ఆ తరువాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.

‎ఇకపోతే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ కె ర్యాంప్. ఈమూవీలోయుక్తి తరేజా హీరోయిన్ గా నటించింది. దీపావళి పండుగ కానుకగా ఈ నెల 18న థియేటర్లలోకి ఈ మూవీ రానుంది. అయితే ఇప్పటికే షూటింగ్ తో పాటు అన్ని కార్య క్రమాలను పూర్తి చేసుకున్న మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఫన్నీగా ఉంటూనే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ విడుదలైనప్పుడు లిప్ కిస్సులు, బూతుల గురించి కాస్త నెగిటివిటీ వచ్చింది. దీంతో ఈసారి ట్రైలర్ లో ఆ డోస్ తగ్గించినట్లే కనిపించారు.
KRAMP Trailer | Kiran Abbavaraam | Yukti Thareja | Jains Nani | Razesh Danda | Hasya Movies

‎రెండు మూడు చోట్ల మాత్రం కిస్సులు, డబుల్ మీనింగ్ బూతులు మాత్రమే వినిపించాయి. ట్రైలర్ బట్టి చూస్తే కుమార్ అనే కుర్రాడికి తండ్రి మాత్రమే ఉంటాడు. దీంతో అల్లరిచిల్లరగా తిరుగుతూ మందు తాగుతూ బతికేస్తుంటాడు. అయితే చదువుకునేందుకు కేరళలోని కొచ్చి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇబ్బంది పెట్టి మరీ ఆమె తనని ప్రేమించేలా చేస్తాడు. కుమారే అనుకుంటే ఆమెకు సైకలాజికల్ ప్రాబమ్స్ ఉంటాయి. దీంతో తిక్కతిక్కగా ప్రవరిస్తుంది. చివరకు ఈ జంట ఒక్కటైందా లేదా అనేది స్టోరీలా అనిపిస్తోంది.