ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న కిరాక్ ఆర్పీ.. త్వరలోనే పెళ్లి!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిన కమెడియన్ లలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన జబర్దస్త్ వేదికపై తన అద్భుతమైన కామెడీ టైమింగ్, తన పంచ్ డైలాగులతో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఆర్పీ గత కొంత కాలం నుంచి ఈ కార్యక్రమానికి దూరమయ్యారు. దీంతో ఈయన ఇతర కార్యక్రమాలలో సందడి చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా కిరాక్ ఆర్పీ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో ప్రకటించాడు. ఈ క్రమంలోనే తనతో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిశ్చితార్థానికి పలువురు జబర్దస్త్ కమెడియన్ లతో పాటు సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక కిరాక్ ఆర్పీ లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించానని వీరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారని గతంలో తెలియజేశారు.

ఈ క్రమంలోనే తాను ప్రేమించిన అమ్మాయితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఆర్పీ త్వరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం కామెడీ స్టార్స్ కార్యక్రమంలో ఈయన తన కామెడీతో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా త్వరలోనే దర్శకుడిగా ఆయన తన డెబ్యూ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొత్తానికి కిరాక్ ఆర్పీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలియడంతో అభిమానులు పెద్ద ఎత్తున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.