చిరంజీవి త్వరలో ‘కింగ్ మేకర్’

King Maker was the title considering for Chiranjeevi's remake movie
King Maker was the title considering for Chiranjeevi's remake movie
మెగాస్టార్ చిరంజీవీ సైన్ చేసిన సినిమాల్లో ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ కూడ ఒకటి. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేస్తున్న ‘ఆచార్య’ సినిమా దాదాపు పూర్తైనట్టే. ఇంకో 20 రోజుల పాటు షూటింగ్ జరిపితే సినిమా పూర్తవుతుంది. అది పూర్తవ్వగానే చిరు ‘లూసిఫర్’ రీమేక్ షూటింగ్ మొదలుపెడతారు.  మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పుష్కలమైన ఎలివేషన్స్ కలిగిన సబ్జెక్ట్, అందునా చిరును పంచెకట్టులో ఫుల్ లెంగ్త్ సినిమాలో కనిపించబోతున్నారు.  
 
ఈ సినిమాకు అనేక టైటిల్స్ వినిపిస్తున్నాయి. వాటిలో ‘కింగ్ మేకర్’అనేది ప్రముఖంగా వినిపిస్తోంది.  ఇదే ఫైనల్ చేసే అవకాశాలున్నాయి.  ఇదే గనుక టైటిల్ అయితే కథకు చాలా బాగా సెట్ అవుతుంది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ – సూపర్ గుడ్ ఫిలిమ్స్ – ఎన్‌విఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై  ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ నిర్మించనున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు ఫైనల్ అయ్యాయి కూడ. చాలా తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తిచేయాలనేది చిరంజీవి టార్గెట్.  దీని తర్వాత ఆయన ఇంకో రెండు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు.