చివరి కోరిక తీరకుండానే కన్ను మూసిన కృష్ణం రాజు

టాలీవుడ్ లో ‘రెబెల్ స్టార్’ గా ఎన్నో హిట్స్ ఇచ్చిన సీనియర్ నటుడు కృష్ణం రాజు ఈరోజు తుది శ్వాశ విడిచారు. ఆయన మృతితో యావ‌త్ సినీ ప‌రిశ్ర‌మ షాక్‌లో ఉంది. న‌టుడిగా, నిర్మాత‌గా, పొలిటీషియ‌న్‌గా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఆయ‌నకు ప్రభాస్‌కి aసంబంధించిన ఓ విష‌యంలో మాత్రం కోరిక నేర‌వేర‌లేదు.

ఇంత‌కీ కృష్ణంరాజుకి తీరని ఆ కోరిక ఏంటో తెలుసా!.. ప్ర‌భాస్ పెళ్లి. ఇప్పటికే నలభై ఏళ్ళు వ‌చ్చిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ పెళ్లి చేసుకోలేదు. ప్ర‌భాస్‌కు త‌గ్గ అమ్మాయిని వెతుకుతున్నామ‌ని, ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే ఆయ‌న పిల్ల‌ల్ని ఎత్తుకుని ఆడించాన‌ల‌నే కోరిక ఉన్న‌ట్లు కృష్ణంరాజు అనేక సంద‌ర్భాల్లోనూ చెప్పారు. ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చూడాల‌ని ఎంతో ఆశ ప‌డ్డారు. కానీ ఆ కోరిక తీర‌కుండానే ఆయ‌న క‌న్నుమూశారు.