అలా చనిపోవాలని కృష్ణం రాజు గారు కోరుకున్నారు

టాలీవుడ్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణాన్ని ఆ కుటుంబం ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.

కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు తాజాగా ఆయన పరిస్థితి మరింత విశ్రమించడంతో ఆదివారం తెల్లవారుజామున సమయంలో తుది శ్వాస విడిచారు.

అయితే తాను ఎలా చనిపోవాలనుకుంటున్నారో 16 ఏళ్ల క్రితమే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు, ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ., కృష్ణంరాజు గారు అప్పుడు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం. ”పచ్చని చెట్టు నీడలో కూర్చొని.. నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని.. గుండెల మీద చేతులు వేసుకుని.. నిర్మలమైన ఆకాశం వంక చూస్తూ నేను తుదిశ్వాస విడవాలి. ఆ రోజూ, ఈరోజూ.. అదే నా కోరిక” అంటూ కృష్ణంరాజు గారు ఎంతో ఫీల్ తో అప్పుడు ఆయన చెప్పారు. ఈ మాటలను బట్టి కృష్ణంరాజు గారి వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.