Crime News: సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒక్కోసారి వాటి తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల అనర్థాలు జరుగుతాయి. తాజాగా తమిళనాడులో ఎటువంటి ఒక సంఘటన చోటు చేసుకుంది.చెన్నైలోని తాండయార్‌పేట్‌కు చెందిన హరి అనే యువకుడికి జీవిత అను మహిళతో రెండు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. అయితే ఇటీవల తన భార్య చావుబతుకుల మధ్య ఉందని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించారు. జీవిత మరణించడం వెనుక తమకు అనుమానాలు ఉన్నాయని , విచారణ చేపట్టాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే జీవిత కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
జీవిత భర్త హరిని పోలీసులు విచారించగా మొదట ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు హరి పోలీసులకు వెల్లడించాడు. హరీ చెప్పిన సమాధానం పోలీసులకు అనుమానం కలిగించగా.. పోస్టుమార్టం లో కూడా జీవిత చాతి పై బలంగా తన్నటం వల్లే మరణించిందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసులు తమదైన శైలిలో హరిని విచారించగా తానే కొట్టి చంపినట్టు పోలీసుల ముందు అంగీకరించాడు.
పెళ్లి జరిగిన కొన్ని రోజులు సాఫీగా సాగిపోయిన వారి కాపురం కొన్ని రోజుల తర్వాత చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండేవారు.
కూతురు,అల్లుడి మధ్య గొడవలు పెరగటంతో జీవిత తండ్రి తాను ఉంటే గొడవలు సద్దుమణిగి కాపురం చక్కబడుతుందని భావించి కూతురు వద్దకు వచ్చి ఉంటున్నాడు. కానీ పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోవటంతో జీవిత తండ్రి ఇంటి నుండి వెళ్లిపోయాడు. తన తండ్రి ఇంటి నుంచి వెళ్లి పోవడానికి తన భర్తే కారణమని జీవిత తన భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ పెరిగి జీవిత పై హరి దాడి చేశాడు. ఈ క్రమంలో హరి ఆవేశంతో జీవిత జాతిపై బలంగా ఉండటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. క్షణికావేశంలో భార్యను హత్య చేసిన హరి ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు అసలు నిజాన్ని బయటకు తీసి హరిని అరెస్టు చేశారు.