Kichha Sudeep: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనపై అలాంటి కామెంట్స్ చేసిన కిచ్చా సుదీప్.. గుణపాఠం అంటూ!

Kichha Sudeep: రెండు తెలుగు రాష్ట్రాలలో సంధ్య థియేటర్ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఘటనపై వాదనలు జరుగుతుండగా, రాజకీయరంగులు కూడా కులుముకుంటున్న విషయం తెలిసిందే. బన్నీని అరెస్టు చేయడం ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం ఇవన్నీ కూడా అభిమానులను షాకింగ్ కి గురి చేశాయి. ఒక్క రోజు జైలుకి వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ కోసం టాలీవుడ్ అంతా కదిలింది. ఒకరి తర్వాత ఒకరు సెలబ్రిటీలు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అంతా పరామర్శిస్తూనే ఉన్నారు.

దీంతో రేవతి కుటుంబాన్ని పట్టించుకునే వారే లేరా? అంటూ సోషల్ మీడియాలో వాదన వినిపించింది. దీంతో కాంగ్రెస్ లీడర్లు రేవతి ఫ్యామిలీని పరామర్శించే పని పెట్టుకున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ ని అరెస్ట్ చేయడం మాత్రం తప్పే అని, అందులో బన్నీది కేవలం నైతిక బాధ్యతే ఉంటుందని అంటున్నారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ. 25 లక్షలు ప్రకటించడం, బాలుడి వైద్యానికి ఖర్చులు భరించడం వంటివి చేస్తున్నాడు. కానీ ప్రభుత్వమే కక్ష కట్టి బన్నీని అరెస్ట్ చేసిందంటూ వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే బన్నీని ఈ కేసులో ఏ1గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మాత్రం బన్నీకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ ను మంజూరు చేసింది. ఇప్పటికే ఈ విషయంపై చాలామంది సెలబ్రిటీలు స్పందించిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా కన్నడ నటుడు హీరో సుదీప్ కూడా స్పందించారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సినిమా థియేటర్ కీ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. ఇలాంటి ఒక ఘటన జరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. అసలు ఇలాంటి దుర్ఘటన జరగాలని కూడా ఎవరు ఆశించరు. ఇది వరకు ఇలాంటి ఓ ఘటన జరగలేదు.. ఇలాంటి ఘటన జరిగితే.. బాధ్యులు ఎవరు? ఎవర్ని శిక్షించాలి అన్నది కూడా చట్టం చెప్పలేదు.. ఇది మొదటి తప్పు.. ఇలాంటి తప్పులు జరిగినప్పుడే దానికి తగ్గట్టుగా మారుతూ వస్తుంటుంది.. కానీ ఈ ఘటన పునరావృత్తం కాకుండా చూసుకోవాలి.. ఇదొక గుణపాఠం కావాలి.. నెక్ట్స్ టైం ఎవరైనా అలా వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. థియేటర్ మేనేజ్మెంట్, పోలీసులకు తెలిపాలి.. ముందుగా అన్ని సెక్యూరిటీ బాధ్యతల్ని పరిశీలించుకోవాలి అంటూ కిచ్చా సుదీప్ తెలిపారు.