హిందీలో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ సినిమా కోసం వస్తోంది

Kiara Advani to do NTR
Kiara Advani to do NTR
 
ఎన్టీఆర్ తర్వాతి సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.  ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేయనున్న సినిమా కావడంతో అభిమానుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ లాంటి హిట్ సినిమా వచ్చి ఉండటంతో ఈసారి కూడ అలాంటి మంచి సినిమానే ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకిగా ఎవరిని తీసుకుంటారు అనే విషయమై ఇన్నిరోజులు పెద్ద చర్చ నడిచింది. కొరటాల మాత్రం కియరా అద్వానీ అయితే ఎన్టీఆర్ సరసన కొత్తగా ఉంటుందని భావిస్తున్నారట.  
 
కియరా ప్రస్తుతం హిందీలో బిజీగా ఉంది.  ‘కబీర్ సింగ్’ విజయం తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయింది.  చేతి నిండా సినిమాలున్నాయి. తెలుగులో ఆమె మొదటి చిత్రం ‘భరత్ అనే నేను’.  దీనికి దర్శకుడు కొరటాల శివనే.  ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  దీని తర్వాత కియరా చేసిన ‘వినయ విధేయ రామ’ పెద్దగా ఆడలేదు.  దాని తర్వాత ఆమె తెలుగులో సినిమా చేయలేదు.  మళ్లీ ఇన్ని సంవత్సరాలకు ఆమె ఎన్టీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే ఆమెతో చర్చలు ముగిసాయట.  త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంటుందని తెలుస్తోంది.  కియరా అద్వానీ సైతం సౌత్ సినిమా చేయనున్నానని, అఫీషియల్ ప్రకటన త్వరలోనే ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.