KGF Chapter 2 Trailer Talk : కసి కసిగా KGF 2 ట్రైలర్!

KGF Chapter 2 Trailer Talk

KGF Chapter 2 Trailer Talk : హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్, రెప్పపాటు కంటే వేగంగా బుల్లెట్ల వర్షం, ప్రాణాలకు తెగించిన హీరో- విలన్లు, భీకర నరమేధ దృశ్యాలు, రక్తపాతం… ఇవీ ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న KGF 2 ట్రైలర్ సంధిస్తున్న హైపర్ యాక్షన్ వినోదం.

ఈ సీక్వెల్‌ ట్రైలర్ లో, సూపర్ స్టార్ యష్ రామకృష్ణ పవన్ అలియాస్ రాకీభాయ్ గా, సంజయ్ దత్ రాకీ శత్రువైన అధీరగా ప్రత్యక్ష మయ్యారు. మరోపక్క రవీనా టాండన్ శక్తివంతమైన రాజకీయ నాయకురాలు రమికా సేన్ పాత్రలో పరిస్థితిని నియంతృస్తోంది… ఈ యాక్షన్-ప్యాక్డ్, థ్రిల్లింగ్ ట్రైలర్‌లో యష్, సంజయ్ దత్ లు పోరాటాన్ని, హింసనూ కొత్త కోణంలో ప్రదర్శిస్తూ KGF 2 ని ఖతర్నాక్ మూవీగా ఎస్టాబ్లిష్ చేసేశారు!

“రక్తంతో రాసిన కథ ఇదీ.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం.. ముందుకెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుంది” అని ప్రకాష్ రాజ్ విసిరే డైలాగ్ తో ట్రైలర్ ఉరుకులుబెడుతుంది…రవీనా టాండన్ రాజకీయ నాయకురాలి పాత్రలో కొత్త లుక్ తో వుంటే, సంజయ్ దత్ అధీరా పాత్రలో పరమ భయంకర మేకప్ తో భయపెట్టేస్తాడు. ఈ తెలుగు వెర్షన్ ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ తో బాటు రావు రమేశ్ కనపడతారు.

KGF Chapter 2 Trailer | Telugu |Yash|Sanjay Dutt|Raveena|Srinidhi|Prashanth Neel|Vijay Kiragandur

 

ట్రైలర్ లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చే యష్ ‘వయొలెన్స్ నన్ను ఇష్టపడుతోంది, నేను దాన్ని దూరం వుంచలేను’ అంటూ ఇంగ్లీషులో డైలాగ్ కొట్టి యాక్షన్ ప్రారంభిస్తాడు. ‘నాతో ఎవ్వరూ దుష్మనీ తట్టుకోలేరు’ అంటూ యష్ కొట్టే డైలాగ్ ఇంకో హైలైట్.

ఇలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘KGF’ ఛాప్టర్1 తో ఇచ్చిన పానిండియా సక్సెస్ ని KGF 2 తో ఇంకో లెవెల్ కి తీసికెళ్ళాల్సిన బాధ్యత మీద వుంది. ఈ ట్రైలర్ చూస్తే ఇది సాధ్యమే అన్పించేలా వుంది.

కాగా RRR హీరో రామ్ చరణ్ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ ని రిలీజ్ చేశారు. . KGF 2 కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం హిందీలో విడుదల కానుంది. దీనికి రితేష్ సిధ్వాని, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏఏ ఫిల్మ్స్ ఫర్హాన్ అక్తర్ సమర్పించారు. హోమబుల్ ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాత. ఏప్రెన్ 12 న విడుదల.