ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో ఆల్ టైం రికార్డు సెట్ చేసిన “కేజీఎఫ్ 2”..!

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో భారీ ఫేమ్ తెచ్చుకున్న స్టార్ హీరోస్ లో కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకడు. తన కేజీఎఫ్ రెండు సినిమాలతో చరిత్ర తిరగరాసిన యష్ తన సొంత కష్టానికి తగ్గ ఫలితాన్ని అందుకున్నాడు.

ఇక ఇక్కడ నుంచి ఎలాంటి సినిమాలు చేస్తాడు అనేది పక్కన పెడితే ఈ సినిమా మాత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. తాజాగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక బిగ్గెస్ట్ ఆల్ టైం రికార్డుని నమోదు చేసిందట. జెనరల్ గా సినిమా రిలీజ్ అవుతుంది అంటే మొదటగా ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ బుకింగ్స్ కోసమే ఆడియెన్స్ చూస్తారు.

వాటిలో మంచి ఫేమస్ యాప్ ఏదన్నా ఉంది అంటే అది బుక్ మై షో అని చెప్పాలి. ఇందులో ఈ సినిమా సెన్సేషనల్ రెకార్డ్ సెట్ చేసింది. ఇప్పటి వరకు ఏ పాన్ ఇండియా సినిమా అలాగే హిందీ సినిమాలకు కూడా లేని విధంగా 17.1 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయట.

దీనితో మన ఇండియన్ సినిమా దగ్గర ఈ సినిమా ఈ రికార్డు సెట్ చేసిన సినిమాగా కేజీఎఫ్ 2 ఇప్పుడు భారీ రికార్డుని సెట్ చేసింది. అయితే దీనికి ముందు “బాహుబలి 2” ఉండేదట. దీనిని ఇప్పుడు ఫైనల్ గా కేజీఎఫ్ 2 బీట్ చేసి కొత్త రికార్డు సెట్ చేసింది. అయితే వసూళ్ళలో మాత్రం బాహుబలి 2 ని కొట్టలేకపోయింది.