KGF Chapter 2 Mania Started : మొట్టమొదటి కన్నడ సినిమాగా అప్పుడే రికార్డుల మోత స్టార్ట్ చేసిన “కేజీయఫ్ 2”.!

KGF Chapter 2 Mania Started

KGF Chapter 2 Mania Started : ఇప్పుడు ఇండియన్ సినిమాని మన దక్షిణాది భారత సినిమాలే ఏలుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఇదే మాటని అటు నార్త్ ఆడియెన్స్ కూడా గట్టిగా చెబుతున్నారు. లేటెస్ట్ గా అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రాజమౌళి ల భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) సంచలన విజయాన్ని నమోదు చెయ్యగా దీని తర్వాత మళ్ళీ అందరి చూపులు ఇంకో మోస్ట్ అవైటెడ్ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2” పై పడ్డాయి.

కన్నడ స్టార్ హీరోస్ లో ఒకడైన రాకింగ్ స్టార్ స్టార్ యష్ నటించిన ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. మరికొన్ని రోజుల్లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా లేటెస్ట్ గా సెన్సేషనల్ రికార్డుని నమోదు చేసింది. గతంలో ఈ సినిమా ఇండియా లోనే ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ కలిగిన సినిమాగా ప్రముఖ ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో నమోదు చెయ్యగా ఇప్పుడు ఆ లెక్క 1 మిలియన్ కి చేరుకుంది.

దీనితో మరో ఇండియన్ సినిమాగా ఇది రికార్డులకెక్కగా కన్నడ ఇండస్ట్రీ నుంచి అయితే ఈ ఫీట్ అందుకున్న మొదటి సినిమాగా నిలిచింది. దీనితో ఇక్కడ నుంచే ఈ సినిమా మోత స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈ ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.