Kgf chapter 2 : “కేజీఎఫ్ 2” ఫస్ట్ పవర్ఫుల్ సాంగ్.. రాకీ భాయ్ లో కొత్త కోణాలు గమనించారా?

Kgf chapter 2 : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకొని సిద్ధంగా ఉన్న క్రేజీ సీక్వెల్స్ లో బాహుబలి 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఎదురు చూస్తున్న సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు మొట్ట మొదటి సాంగ్ “తూఫాన్” ని రిలీజ్ చేశారు.
సంగీత దర్శకుడు రవి బాసృర్ అందించిన ఈ ఫస్ట్ సాంగ్ మంచి పవర్ ఫుల్ గా అంచనాలు రేకెత్తించేలా ఉందని చెప్పాలి. పార్ట్ 1 లో పాటల బీట్ తో పోలిస్తే కాస్త తక్కువ కావొచ్చు కానీ ఈ సాంగ్ మాత్రం బాగానే ఉంది. అలాగే ఈ సాంగ్ లో ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా రాకీ భాయ్ పాత్రని చాలా ఆసక్తికరంగా చూపించారు. తన కథని మళ్లీ సాంగ్ లో బ్యాక్గ్రౌండ్ లో నరేట్ చేస్తూ తన సైన్యంతో తాను ఎలా ఉంటాడో అనే ఆసక్తికరమైన అంశాలు చూపించారు.
రాకీ పాత్ర నారాచి ప్రజల తో ఎంత పాజిటివ్ గా ఉంటాడో వారిని తనతో కలసి పని చేయించేలా చూపడం ఒక సరికొత్త కోణం అని చెప్పాలి. దీనితో రాకీ ని మరీ నెగిటివ్ గా ఈసారి పాజిటివ్ గా చూపించనున్నారని అర్ధం అవుతుంది. మరి ఈ ఫస్ట్ సాంగ్ తోనే చాలా క్లారిటీ రాగా ఈ మార్చ్ లో రాబబోతున్న ట్రైలర్ ఇంకెంత ఆసక్తి గా ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్ మరియు రవీనా తాండన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు చేయగా హోంబలే పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.
https://www.youtube.com/watch?v=xUe3eR0n380