KGF Chapter 2 : అక్కడ బాక్సాఫీస్ దగ్గర “RRR” వసూళ్ళని టచ్ కూడా చేయలేకపోయిన “కేజీఎఫ్ 2”

KGF Chapter 2 : ఫైనల్ గా కరోనా మహమ్మారి తగ్గి అనుకున్న భారీ సినిమాలు అన్నీ రిలీజ్ అవ్వడం సారీ చేసాయి. మరి వాటిలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. అయితే వాటిలో మళ్ళీ ఖచ్చితంగా అన్ని భాషల్లోని మంచి ప్రభావం చూపించే సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.
వీటిలో మన తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి కాగా మరొకటి కన్నడ సినిమా “కేజీఎఫ్ చాప్టర్ 2”. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఎక్కడా తీసిపోనివి అని చెప్పాలి. వీటికి ఉన్న హైప్ కి గాని నెలకొల్పే బాక్సాఫీస్ రికార్డులు, ఓపెనింగ్స్ అంతా ముందే చాలా మంది ఊహించారు.
అయితే ముందు ట్రిపుల్ ఆర్ సినిమా భారీ వసూళ్లతో ఇండియన్ సినిమా దగ్గర కొత్త లెక్కలు సెట్ చెయ్యగా దానిని ఇప్పుడు కేజీఎఫ్ 2 సవరిస్తుంది. అయితే మన దగ్గర కేజీఎఫ్ 2, RRR సినిమాని బ్రేక్ చెయ్యొచ్చు ఏమో గాని ఓవర్సీస్ లో మాత్రం కింగ్ రాజమౌళి సినిమానే అని చెప్పి తీరాలి.
ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర రాజమౌళి సినిమాకి కేవలం తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ కి వచ్చిన వసూళ్లు కూడా కేజీఎఫ్ 2 కి అక్కడ సినిమా రిలీస్ అయ్యే వరకు కూడా రాలేదు. దీనితో అక్కడ మాత్రం అసలు RRR దగ్గరకి కూడా ఈ సినిమా రాలేకపోయింది.
ఈ లెక్కన RRR సినిమా సెన్సేషన్ అక్కడ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.