బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్న కె.జి.ఎఫ్ చాప్టర్ 2.. ఎన్ని హైలెట్స్ ఉన్నాయో చూడండి ..!

ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో వచ్చిన ‘కె.జి.ఎఫ్’ సినిమా భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకున్న సంగతి తెల్సిందే. 2018 లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా అన్నీ భాషల్లో భారీ సక్సస్ ని సాధించింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ఊహించని సక్సస్ సాధించిన సినిమా అంటే ఈ సినిమానే. కన్నడ భాషల్లో తెరకెక్కే సినిమాలన్ని చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కేవే. అదీ కాక ఈ రేంజ్ హిట్ అంటే ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదనే చెప్పాలి.

5 Years of Baahubali - The Beginning || A Visual extravaganza || Prabhas,  Rana Daggubati, Tamannah - YouTube

చెప్పాలంటే కన్నడ సినిమాలని అంతగా ఎవరు పట్టించుకోరన్న టాక్ కూడా ఉండగా దాన్ని చెరిపేసింది కె.జి.ఎఫ్. ముఖ్యంగా ‘కె.జి.ఎఫ్’ ఏ భాషలో చూసిన పరభాషా చిత్రం చూస్తున్న భావన ఏ ప్రేక్షకుడికి రాదు. ఇక యష్ మాస్ హీరోగా ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానానికి అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలందరూ ఫ్లాటైపోయారు. రిలీజైన అన్ని భాషల్లో కె.జి.ఎఫ్ సూపర్ హిట్ అవడానికి కారణం ఇదే అని అందరూ అభిప్రాయపడ్డారు.

K.G.F: Chapter 1 Epic Falls Short Of Greatness By A Mile

కాగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా మేకర్స్ ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అక్టోబర్ 23నే ‘కె.జి.ఎఫ్2’ రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. కానీ కరోనా వల్ల చిత్రీకరణ కూడా పూర్తవలేదు. కాగా ఇటీవలే మళ్ళీ ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ ని శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే అధీరాగా నటిస్తున్న బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమాని భారీ స్థాయిలో 2021 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. రాజమౌళి తెరకెక్కిన ‘బాహుబలి’, ప్రభాస్ ‘సాహో’ సినిమాల ని మిమంచి ‘కె.జి.ఎఫ్2’ లో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇన్నాళ్ళు బాహుబలి సీమా విజువల్ ఎఫెక్ట్స్ గురించి చెప్పుకున్న ప్రేక్షకులు ‘కె.జి.ఎఫ్2’ రిలీజయ్యాక ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారని అంటున్నారు.