దేశంలో పేరుగాంచిన స్వామిజీలలో కేశావనంద భారతి ఒకరు. ఆ స్వామి సెప్టెంబర్ 6న శివైక్యం చెందారు. అయితే ఆయన పేరు తెలియని పోటీపరీక్షార్థి ఉండరు. అంతటి పేరు ఎందుకు వచ్చింది ఆయన కేసు దేనికి సంబంధించిదో తెలుసుకుందాం..
భూసంస్కరణలపై – కేరళ భూసంస్కరణ చట్టంపై 1973లో కేశవానంద భారతి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. 1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు.
68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. రాజ్యాంగ మౌలిక స్వరూపానికి సుప్రీంకోర్టు సంరక్షణదారని తీర్పు ఇచ్చింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు. చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని న్యాయ కోవిదులు అభివర్ణిస్తుంటారు.
– శివ శ్రీ