‎Keerthy Suresh: అలాంటి టైమ్ లో కారు ఒంటరిగా డ్రైవ్ చేస్తూ వెళ్లిపోతాను.. కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!

‎‎Keerthy Suresh: టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట నేను శైలజ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది. మహానటి లాంటి సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటుగా మంచి మంచి అవార్డులు సైతం అందుకుంది. జాతీయ ఉత్తమ నటిగా అవార్డును కూడా అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళం హిందీ మలయాళం సినిమాలలో కూడా నటించి మెప్పించింది.

‎మొన్నటి వరకు తెలుగు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీ సినిమాలలో నటిస్తోంది. బాలీవుడ్‌లో నటించిన ఏకైక చిత్రం బేబిజాన్‌ పూర్తిగా నిరాశ పరచింది. ఈ సమయంలోనే తన చిరకాల బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని,వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. అలాగే సమీప కాలంలో కీర్తి సురేశ్‌ నటించిన ఉప్పు కారం చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం గురించి కీర్తి సురేశ్‌ చాలా ఎక్కువగానే ఊహించుకుంది. కానీ ఆ చిత్రం పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది. ఆ తరువాత మరో కొత్త చిత్రంలో నటించలేదు.

ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ చేసిన వాక్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ.. ఒక్కోసారి నేను అప్‌సెట్‌ అవుతుంటాను. అప్పుడు ఏం చేస్తానో తెలుసా.. ఫుల్‌గా భోజనం చేస్తాను. అలాగే కారు తీసుకుని ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళతాను. ఆ సమయంలో కారులో మంచి సంగీతం వింటాను. అలానే ఇంట్లో ఒక పెట్‌ కుక్కను పెంచుకుంటున్నాను. నేను అప్‌సెట్‌ అయితే దాని ముఖం చూస్తే వెంటనే అంతా మాయం అవుతుంది అని కీర్తి సురేశ్‌ తెలిపింది.