ఆ ఒక్క నిర్ణయంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ కోల్పోయిన కీర్తి సురేష్?

కీర్తి సురేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎన్నో అద్భుతమైన సినిమాలలో అద్భుతమైన పాత్రలో నటించిన ఈమె విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తున్న కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఈమెకు స్టార్ హీరోలతో నటించే అవకాశం కూడా కోల్పోవడంతో అలర్ట్ అయిన కీర్తి సురేష్ తన కెరియర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు గ్లామర్ షో కి దూరంగా ఉన్నటువంటి ఈమె ఏకంగా గ్లామర్ షోకి తెరతీసింది.

కీర్తి సురేష్ నటించిన సినిమాలలో ఎంతో నిండుదనంగా ఉన్న పాత్రలలో నటించారు. అయితే తనకు క్రమంగా అవకాశాలు తగ్గిపోవడంతో ఏకంగా సర్కారు వారి పాట సినిమాలో ఈమె గ్లామర్ షో చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.మహానటి వంటి అద్భుతమైన సినిమాలో నటించిన కీర్తి సురేష్ ఆ తర్వాత పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై దృష్టి సారించారు.అయితే ఈ సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయకపోవడంతో ఈమె కెరియర్ పై పూర్తిగా దెబ్బ కొట్టిందని చెప్పాలి.

ఈ విధంగా వరుస సినిమాలు ఈమెకు బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని మిగిల్చడంతో అలర్ట్ కీర్తి సురేష్ పూర్తిగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను కూడా కోల్పోతూ వచ్చారు. ఈ విధంగా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించడమే కాకుండా హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా నటిస్తూ ఈమె తన కెరియర్లో తప్పటడుగులు వేస్తున్నారు. ఇలా అగ్ర హీరోలకు చెల్లెలు పాత్రలో నటించడం వల్ల ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను కోల్పోతున్నట్లు తెలుస్తోంది.ఇది గుర్తించిన కీర్తి సురేష్ పూర్తిగా కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకోవడమే కాకుండా, అవకాశాల కోసం గ్లామర్ షో కూడా చేస్తూ సందడి చేస్తున్నారు.