Keerthy Sures: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి మనందరికీ తెలిసిందే. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే రెమ్యునరేషన్స్ గురించి గతంలో చాలామంది హీరో హీరోయిన్లు స్పందించిన విషయం తెలిసిందే. హీరోలకు ఎక్కువ రెమ్యూనరేషన్లు ఇస్తారని హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువగా ఉంటుంది అంటూ కూడా చాలా కామెంట్స్ వినిపించాయి. ఇటీవలే సమంత కూడా ఆడ, మగ తేడా లేకుండా అందరికి ఒకే రెమ్యునరేషన్స్ ఇస్తాను, నా నిర్మాణ సంస్థలో అలాగే ఇస్తాను, అందరూ అలాగే ఇస్తే బాగుంటుంది అని శుభం సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడింది.
ఈ విషయం అప్పుడు బాగా చర్చగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కీర్తి సురేష్ కూడా రెమ్యూనరేషన్ గురించి మాట్లాడింది. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉప్పు కప్పురంబు. ఈ సినిమా జులై 4 న నేరుగా అమెజాన్ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కీర్తి సురేష్. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈక్వల్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెమ్యునరేషన్ అనేది మహిళలు, మగవాళ్లకు సంబంధించింది కాదు. ఇందులోకి ఈక్వాలిటీ తీసుకురావడం అనేది నాకు అర్ధం కాదు.
ఒక మేల్ యాక్టర్ థియేటర్ కి జనాల్ని ఎలా రప్పించి మార్కెట్ చేస్తున్నారో, అలా ఒక ఫీమేల్ యాక్టర్ కి కూడా ఉందంటే ఇవ్వవచ్చు. ఒక ఫిమేల్ యాక్టర్ కి జనాల్ని రప్పించే స్టామినా, మార్కెట్ ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వవచ్చు. ఈ హీరోయిన్ తో సినిమా చేస్తే ఇన్ని కోట్లు వస్తాయి, పెద్ద కలెక్షన్ వస్తాయి అని నమ్మితే ఇవ్వవచ్చు. హీరోకి ఇంత ఇస్తారు, హీరోయిన్ కి ఇంత ఇవ్వలేదు అనేది కాదు. హీరోలాగా ఫిమేల్ యాక్టర్ కూడా జనాల్ని థియేటర్స్ కి తీసుకొస్తే ఇవ్వవచ్చు. హీరోలకు ఇస్తారంటే వాళ్ళని చూసి ఫ్యాన్స్, చాలా మంది వస్తారు కాబట్టి ఇస్తారు అని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.