Keerthy Suresh : కీర్తి సురేష్ మరీ అంత చీప్ పని చేసిందా.?

Keerthy Suresh : ‘నేను శైలజ’ అంటూ వచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చి, ‘మహానటి’ సినిమాతో అంచనాలకు మించి ఉన్నత శిఖరాల్ని అందుకుంది నటిగా కీర్తి సురేష్. ‘మహానటి’ గా కీర్తి సురేష్ కీర్తి ఆకాశానికెదిగింది.

అయితే, ఆ కీర్తి ఎంతో కాలం నిలవలేదు. ‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్‌కి ఆ స్థాయి సినిమా పడనే లేదు. ఏదో అలా అలా సినిమాలు చేసుకుంటూ పోతోంది. కానీ, అవేమీ కీర్తి సురేష్‌కి పేరు తెచ్చిపెట్టలేకపోతున్నాయ్. తన స్థాయిని మరింత పెంచలేకపోతున్నాయ్. అన్నింటికీ మించి ఈ మధ్య కీర్తి సురేష్‌పై నెగిటివిటీ బాగా పెరిగిపోతోంది.

రీసెంట్‌గా ‘గుడ్ లక్ సఖి’ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చూశాకా, ఇకపై కీర్తి సురేష్ కీర్తి పతాకం జారిపోనుందా.? అనే అనుమానాలొచ్చేశాయ్ ఆమె అభిమానులకి. ఆలోపే ‘గాంధారి’ అంటూ ఓ ప్రయివేట్ వీడియో ఆల్బమ్‌లో నటించి మరింత నెగిటివిటీ మూట కట్టుకుంది కీర్తి సురేష్.

పాపం ‘గాంధారి’ సాంగ్ కోసం చాలానే కష్టపడింది కీర్తి సురేష్. కానీ, రిజల్ట్ రివర్స్ గేర్ వేసిందే ఏం చేస్తాం.! తాజాగా ‘బీస్ట్’ సినిమాలో పాటకి ఇరగబడి స్టెప్పులేసేసింది కీర్తి సురేష్. వెరీ షార్ట్ వీడియో ఇది. నెట్టింట తెగ వైరల్ అయ్యింది. కానీ, ఈ వీడియో పెయిడ్ వీడియో.. అంటూ నెటిజన్లు ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.

మరీ ఇంత చీప్‌గా ఆలోచిస్తుందా.? కీర్తి సురేష్. అవకాశమే లేదు. అన్నట్లు ఈ పాటకి రష్మిక, సమంత తదితర ముద్దుగుమ్మలు కూడా డాన్సులేశారు. ఆ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయ్. పాపం కీర్తి సురేష్ విషయంలోనే ఎందుకీ నెగిటివ్ ప్రచారం.? టైమ్ బ్యాడ్ అంటే ఇదేనేమో.