కీర్తికి ప్రభాస్ అంత పెద్ద ఆఫర్ ఇచ్చాడా ?

Keerthy Suresh as Seetha in Adi Purusha
Keerthy Suresh as Seetha in Adi Purusha
Keerthy Suresh as Seetha

కీర్తి సురేష్.. మహానటి చిత్రంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. నటిగా గొప్ప స్థాయిని అందుకుంది. ప్రస్తుతం ఈమె మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోంది. ఇటు తెలుగు అటు తమిళం రెంటిలోనూ ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో అడపాదడపా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అయితే ఈమధ్య కాలంలో ఆమెకు చెప్పుకోదగిన హిట్ ఏదీ పడలేదు. అయినా కూడ ఆమెకు ఒక భారీ ఆఫర్ తగిలినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే ప్రభాస్ సినిమా ఆఫర్. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇండియాలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ఇదే అత్యంత ఖరీదైన చిత్రం. ఇందులో బాలీవుడ్ స్టార్లు చాలామందే నటిస్తున్నారు. ప్రధాన పాత్రల్లో పాపులర్ నటీనటుల్ని తీసుకుంటున్నారు. తాజాగా లక్ష్మణుడి పాత్ర కోసం స్టార్ నటుడు విక్కీ కౌశల్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక రాముడి పక్కన సీతగా కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని వర్గాలైతే దాదాపు ఆమె కన్ఫర్మ్ అయిపోయినట్టేనని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇన్నాళ్లు సీతగా హిందీ నటి ఎవరైనా ఉంటారని అనుకుంటున్న సౌత్ ప్రేక్షకులకు సంతృప్తి దొరికినట్టే. అంత పెద్ద సినిమాలో దక్షిణాది నటికి అవకాశం కల్పించినందుకు ప్రభాస్ ను సైతం అభినందించవచ్చు.