Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా నిలిచాయి. ముఖ్యంగా నేను శైలజ,మహానటి,నేను లోకల్ వంటి సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. మహానటి సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాతో ఈమె క్రేజ్ భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే తన ప్రియుడితో కలిసి మూడు ముళ్ళు బంధంలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్.
15 సంవత్సరాలుగా తన ప్రియుడిని ప్రేమిస్తున్నప్పటికీ ఎప్పుడూ ఆ విషయాన్ని బయటకి అధికారికంగా ప్రకటించలేదు. దీపావళి పండుగ సమయంలో వీరి ప్రేమ వ్యవహారం బయటపడడంతో , పెళ్లి అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. ఆ వార్తలు నిజమే అని అటు కీర్తి ఆమె తండ్రి ఇద్దరు అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ ఆమె భర్త ఆంటోనీ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. ఈ రోజు వారి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అయిపోయిన నేపథ్యంలో కీర్తి సురేష్ తాజాగా తన వివాహ ఫోటోలు షేర్ చేసింది.
కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. ప్రస్తుతం కీర్తి షేర్ చేసిన ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ప్రముఖులు సెలబ్రిటీలు ఈమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కీర్తి సురేష్ ఆంటోనీలా పెళ్లి ఫోటోలు చూసేయండి.