Keerthi Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. ఇకపోతే మొదట నేను శైలజ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అదేవిధంగా ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఇక ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన గుడ్ లక్ సఖి సినిమాలో నటించింది. నగేష్ కుకునూర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 28న ధియేటర్లలో విడుదల కానుంది. ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ ఈ కార్యక్రమాల్లో భాగంగా బిజీబిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించింది. ఈరోజు అనగా జనవరి 26న నా అధికారిక యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.. నా చానల్ ని సబ్ స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి.. అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది కీర్తి సురేష్.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలు తన అభిమానులతో పంచుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అప్పుడప్పుడు ఫొటో షూట్స్ తో తన అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.