Video Viral: సమంత.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత, అదే క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సమంతకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు అన్న విషయం అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ సమంత వీర అభిమాని అయిన ఒక చిన్న పాపను పరిచయం చేసింది.
చిన్న పాప ఏంటి?అభిమాని ఏంటి? అనుకుంటున్నారా.. తాజాగా ఒక పాప పెద్దయ్యాక ఏమవుతావు అని అడగగా సమంతా అవుతాను అంటూ అందరికీ షాక్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోనీ కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కీర్తి సురేష్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వీడియోని పంచుకుంది. ఆ వీడియోలో ఉన్న ఆ పాప సమంతకు వీరాభిమాని అని చెప్పుకొచ్చింది. ఇక ఆ వీడియోని షేర్ చేస్తూ కీర్తి సురేష్ ఈ విధంగా తెలిపింది. సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి అంటూ సమంతను కోరింది.
ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికే వీడియో పై సమంత స్పందిస్తూ ఎవరు ఈ క్యూటి అంటూ ప్రశ్నించింది.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే సమంత సినిమాల విషయానికి వస్తే.. సమంత ఇటీవలే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ రికార్డుల వ్యూస్ తో దూసుకుపోతుంది.
