Keerthi Suresh And Samantha: టాలీవుడ్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంతకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇకపోతే ప్రస్తుతం సమంత టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న సమంత, ఒక ప్రాజెక్ట్ ఇంకా పట్టాలు ఎక్కక ముందే మరొక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా సమంతకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ సమంత వీరాభిమానిని సమంతకు అలాగే సోషల్ మీడియా కు పరిచయం చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ ఒక పాపను నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? అని అడగగా.. అందుకు ఆ చిన్నారి పెద్దయ్యాక నేను సమంత అవుతాను అని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక పాప చెప్పిన సమాధానం విని కీర్తి సురేష్ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి అని కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే సమంత రిప్లై ఇస్తూ ఎవరు ఈ క్యూటీ అని అడిగింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కీర్తి సురేష్ కోరికమేరకు సమంత ఆ పాపను కలుస్తుందా లేదా అనేది చూడాలి మరి.