కృష్ణ నీరు ఆపేస్తా..జగన్ కు కేసీఆర్ హెచ్చరిక

kcr telugu rajyam

  తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లు జలాల విషయంలో తేడాలు జరిగితే సంహించేది లేదని సీఎం కేసీఆర్ నిన్నటి అపెక్స్ కౌన్సిల్ భేటీలో మరోసారి సృష్టం చేసినట్లు తెలుస్తుంది. కృష్ణ జలాల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్నా వివాదం తెలిసిందే..దాని గురించి మాట్లాడటానికి కేంద్రం జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెబినార్ ద్వారా సమావేశం అయ్యారు.

jagan kcr telugu rajyam

 

 ఈ సమావేశంలో కేసీఆర్ తన వాయిస్ ను గట్టిగానే వినిపించినట్లు తెలుస్తుంది. కృష్ణ జలాలు బేసిన్ దాటి బయటకు వెళ్ళటానికి నేను అసలు ఒప్పుకోను, ఉమ్మడి రాష్ట్రంలోనే పోతిరెడ్డి పాడు ప్రాజెక్టుని మేము వ్యతిరేకిస్తూనే వున్నాం. కాదు కూడదంటూ కృష్ణ నదిపై పోతిరెడ్డి పాడు నిర్మిస్తే, గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీ నిర్మించినట్లు మేము కూడా కృష్ణ నదిపై అలంపూర్ – పెదమరూర్ వద్ద బ్యారేజ్ నిర్మించి కృష్ణ నీటిని కిందకు రాకుండా రోజుకు 3 టీఎంసీలు నీటిని ఎత్తిపోయటం ఖాయం, దీనిని ఎవరు కూడా ఆపేలేరని కేసీఆర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది. పోతిరెడ్డి పాడును మరింత విస్తరించడానికి వీలులేదని మేము చెపుతుంటే కొత్త గా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటూ ఇంకోటి మొదలుపెట్టటం దారుణం.

 అక్రమ ప్రాజెక్టు లు కట్టటానికి వీలులేదని కేంద్రం తేల్చిచెప్పిన కానీ మీరు (ఆంధ్ర ప్రదేశ్ ) పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టు లు కొత్తవి కాదని, పాత వాటిలోనే చిన్న చిన్న మార్పులు చేసి నిర్మిస్తున్నామని, కావాలంటే డీపీఆర్ లు ఇవ్వటానికి మాకేమి అభ్యంతరం లేదని కేసీఆర్ తెలిపాడు. ఇదే సమయంలో జగన్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు లో మూడో టీఎంసీ ఎత్తిపోయటానికి అనుమతి లేదని చెప్పటంతో, అసలు పోతిరెడ్డి పాడుకే అనుమతులు లేవని, పైగా మీరు రాయలసీమ ప్రాజెక్టు అంటూ మరొకటి ఎలా నిర్మిస్తారని కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తుంది. అపెక్స్ సమావేశం తాలూకా పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు కానీ, సమావేశం మాత్రం వాడివేడీగానే జరిగినట్లు తెలుస్తుంది.