దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతున్నా నరేంద్ర మోదీ స్థాయిలో పాలన సాగించే మరో ప్రధాని లేరని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాల సీఎంలకు ప్రధానమంత్రి పదవిపై కన్ను పడింది. దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ల జాబితాలో కేసీఆర్ కూడా ఉన్నారు.
అయితే ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలతో కలిసి కేసీఆర్ ప్రధాని కావడం సాధ్యం కాదు. ఎందుకంటే చాలా రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఎంపీ సీట్ల సంఖ్య చాలా తక్కువనే సంగతి తెలిసిందే. కేసీఆర్ పీఎం కావాలని ఆయనకు తప్ప ఇతర పార్టీల ముఖ్య నేతలకు లేదు. ప్రస్తుతం కేసీఆర్ సొంతంగా జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని బోగట్టా.
కేసీఆర్ దేశం కోసం కంటే స్వలాభం కోసమే ప్రధాని పదవిపై దృష్టి పెట్టారని చాలామంది భావిస్తున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభించి దూసుకెళ్లడం కూడా తేలిక కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. టీ.ఆర్.ఎస్ నాయకులు దేశానికి కాబోయే ప్రధాని కేసీఆర్ అని చెబుతున్నా అది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.
కేసీఆర్ తాను ప్రధాని కావాలని మనసులోని మాటను బయటపెట్టడంతో ఇతర పార్టీల నేతలు సైతం ఆయనను దూరం పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీ.ఆర్.ఎస్ నేతలు ఈ విషయాలను గుర్తుంచుకుంటే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీని బలోపేతం చేసి అనుకూల ఫలితాలు వస్తాయని తెలిస్తే అప్పుడు కేసీఆర్ ప్రధాని పదవి దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. కేసీఆర్ కు, ఆయన అనుచరులకు కేసీఆర్ ప్రధాని అవుతారనే ఆలోచన ఉన్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి,