KCR: నేను కొడితే మామూలుగా ఉండదు…. మౌనం వీడిన కేసీఆర్… రేవంత్ రెడ్డికి కౌంటర్?

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి పాలు అయిన తరువాత కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యారు ఈయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. ఇలా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం గురించి కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాలలో ప్రశ్నించినప్పటికీ కూడా ఈయన మాత్రం అసెంబ్లీలోకి అడుగు పెట్టడం లేదు.

ఇక బిపార్టీ గురించి రేవంత్ అలాగే కాంగ్రెస్ నాయకులు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ లేదా ఇతర పార్టీ నాయకులు స్పందిస్తున్నారు తప్ప ఇప్పటివరకు ఎక్కడా కూడా కెసిఆర్ స్పందించలేదు అయితే మొదటిసారి ఈయన మౌనం వీడారు. కెసిఆర్ తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జహీరాబాద్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు, నాయకులతో కేసీఅర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పాలన గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కెసిఆర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా సంతోషంగా లేరని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు కెసిఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను దెబ్బకి కొడితే మామూలుగా ఉండదు అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ శక్తి ఎలాంటిదో కాంగ్రెస్ వాళ్లకి చూపించి మెడలు వంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లు అయ్యిందని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఫిబ్రవరి నెలఖరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైన ప్రజలకు చెప్పిన హామీలన్నింటిని నెరవేర్చాము. కానీ తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల హామీలను పూర్తిగా పక్కన పెట్టేసిందని తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు తీరుపై ఫైర్ అయ్యారు.