Kavitha: కీలక నేతలతో కవిత రహస్య మంతనాలు… బిఆర్ఎస్ కు షాక్ ఇవ్వనుందా…ఏం జరుగుతుంది!

Kavitha: కవిత కల్వకుంట్ల బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఈమె తన ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం వంటివి రెండు రోజులలో పూర్తి అయ్యాయి. ఇలా ఒకసారిగా కవిత బిఆర్ఎస్ పార్టీకి దూరం కావడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఏం జరగబోతుందో అనే కుతూహలంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అయితే బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత మరొక కొత్త పార్టీ పెట్టడానికి సన్న హాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే బిఆర్ఎస్ పార్టీలో ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో అలాంటి వారి పట్ల కవిత ఫోకస్ చేస్తూ లిస్టు తయారు చేశారని సమాచారం. అదేవిధంగా జాగృతి కీలక నేతలతో కూడా కవిత రహస్య బేటీ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను కొత్త పార్టీ పెడితే కనుక తన వెంట వచ్చే నేతలు ఎవరనే విషయంపై చర్చలు జరిగినట్టు సమాచారం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా పాల్గొన్న కీలక నేతలను జాగృతిలో చేరే విధంగా కవిత చర్యలు తీసుకోబోతున్నారని సమాచారం.

ఇలా బిఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఈ కుట్రలో భాగంగా నేడు తనపై వేటు పడిందని త్వరలోనే మరికొందరిపై కూడా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ ఈమె హెచ్చరించారు. అయితే ఇదంతా కూడా కేటీఆర్ అలాగే కేసిఆర్ కు తెలియకుండా హరీష్ రావు పెద్ద ఎత్తున మంతనాలు చేస్తున్నారని ఎప్పుడైతే హరీష్ రావు రేవంత్ రెడ్డి ఓకే ఫ్లైట్లో కలిసి వెళ్లారు అప్పటినుంచి బిఆర్ఎస్ పార్టీలో అలజడులు మొదలయ్యాయి అంటూ ఈమె హరీష్ రావు పై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. మరి కవిత రాజకీయ ప్రయాణం ఎటువైపు వెళుతుందో తెలియాల్సి ఉంది.