ప్రతిసారి నేను చెప్పిన వాళ్ళే గెలిచారు.. ఈ సారి కూడా తనే విన్నర్: కౌశల్

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం మరొక రోజుతో ముగియనుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ విన్నర్ గురించి చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే బిందుమాధవి బిగ్ బాస్ విన్నర్ అంటూ పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమం మొదటి నుంచి బిందు మాధవి మొదటి స్థానంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో కౌశల్ గెలుపొందిన తర్వాత ఈయన బిగ్ బాస్ కార్యక్రమం చూస్తూ ప్రతి సారి విన్నర్ ఎవరనే విషయం ముందుగానే అంచనా వేసి చెప్పేవాడు.

ఈ విధంగా కౌశల్ చెప్పిన విధంగానే బిగ్ బాస్ 3విన్నర్ గా రాహుల్, నాలుగవ సీజన్ లో అభిజిత్, 5 వ సీజన్ లో సన్నీ గెలుకొందారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి నుంచి అఖిల్ బిందుమాధవి మధ్య పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. ఇక ఈ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ స్పందిస్తూ బిందు మాధవి ప్లీజ్ ఈ కార్యక్రమానికి విజేతగా నిలుస్తారు అని ముందుగానే అంచనా వేశారు.

అయితే ప్రస్తుతం కౌశల్ చెప్పిన విధంగానే విన్న బిందుమాధవి అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై కౌశల్ స్పందిస్తూ తాను గతంలో చెప్పిన విధంగానే బిగ్ బాస్ విజేతలుగా నిలిచారు. ఈసారి కూడా బిందు మాధవి గెలుస్తుందని ఈసారి కూడా తన అంచనా ఏమాత్రం తప్పదని కౌశల్ వెల్లడించారు.