Karthika Deepam: వామ్మో…. అందరి ముందే డాక్టర్ బాబుకు ముద్దుల వర్షం కురిపించిన మంజుల!

Karthika Deepam: బుల్లితెర డాక్టర్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమం ద్వారా డాక్టర్ బాబు ఆయన భార్య మంజుల పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.

ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకు మల్లెమాల వారు కేవలం ఢీ కార్యక్రమంలోనే ముద్దు సీన్స్ పెట్టేవారు కానీ గత కొన్ని వారాల నుంచి సుమ క్యాష్ కార్యక్రమంలో కూడా ఇలాంటి ముద్దు సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలోనే గతవారం బుల్లితెర నటీనటులు విష్ణు ప్రియ సిద్ధార్థ్ వర్మ పాల్గొనగా విష్ణు ప్రియ తన భర్త పై ముద్దుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా మంజుల కూడా డాక్టర్ బాబు పై ముద్దుల వర్షం కురిపించారు.

ఇక వీళ్లిద్దరూ ముద్దులు పెట్టుకుంటూ ఉండగా సుమా వీరిపై అనుకోని విధంగా సెటైర్లు వేశారు. ఈ సందర్భంగా సుమా మాట్లాడుతూ గత వారం కూడా ఈ విధమైనటువంటి కాన్సెప్ట్ పెట్టాము. దీనికి నెటిజన్లు విభిన్న శైలిలో కామెంట్లు చేశారు. ఏకంగా ఫస్ట్ నైట్ కూడా లైవ్ లో చూపించండి అంటూ కామెంట్ లు చేశారని, ఇప్పుడు ఈ సీన్ కనుక చూస్తే ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో అంటూ సుమ వీరిపై సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.