Sreeleela: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారిలో నటి శ్రీ లీల ఒకరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తెలుగులో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు. ఇలా ప్రస్తుతం వరుస టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే శ్రీ లీల నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న శ్రీ లీల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈమె బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ తో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి గత కొద్ది రోజుల క్రితం కార్తీక్ ఇంట్లో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీలో శ్రీ లీల సందడి చేస్తూ కనిపించారు దీంతో వీరిద్దరి డేటింగ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.
ఈ విధంగా కార్తీక్ ఆర్యన్ శ్రీలీల డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న నేపథ్యంలో కార్తీక్ తల్లి ఈ రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఐఫా వేడుకలలో భాగంగా కార్తీక్ తల్లి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు నిర్మాత కరణ్ జోహార్ కార్తీక్ తల్లిని ప్రశ్నిస్తూ మీ ఇంటికి రాబోయే కోడలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నా ఇంటికి రాబోయే కోడలు ఒక మంచి డాక్టర్ అయితే చాలు అంటూ కామెంట్లు చేయడంతో కచ్చితంగా ఈమె శ్రీ లీలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వారి ఇంటికి కాబోయే కోడలు శ్రీ లీలేనని తన కొడుకుతో ఈ బ్యూటీ రిలేషన్ లో ఉన్న వార్తలు నిజమేనని చెప్పకనే చెప్పేశారు. ఎందుకంటే శ్రీ లీల కూడా ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. ఇలా ఒకవైపు మెడిసిన్ చదువుతూనే మరోవైపు సినిమాలలో హీరోయిన్గా నటిస్తున్నారు.
