అభిమానులకి డబ్బులు పంచుతున్న హీరోలు బ్రదర్స్

Karthi, Suriya donates money to their fans
Karthi, Suriya donates money to their fans
లాక్ డౌన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం సినిమా స్టార్లు ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. కొందరు నిత్యావసర సరుకుల అందించి ఆదుకుంటుంటే ఇంకొందరు ఆర్థిక సహాయం చేస్తున్నారు. తమిళ హీరోలు సూర్య, కార్తీ అయితే కష్టాల్లో ఉన్న అభిమానుల కోసం ముందుకొచ్చారు.  అభిమాన సంఘాల్లో ఉన్న అభిమానులు ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే వారిని గుర్తించి చేయూతను అందిస్తున్నారు.  హీరో సూర్య 250 మంది అభిమానులకు ఒక్కొఒక్కరికి 5000 చొప్పున మొత్తం 12.5 లక్షలు వారి బ్యాంక్ ఖాతాల్లోకి వేశారు.  
 
ఇప్పుడు సూర్య తమ్ముడు హీరో కార్తీ సైతం అదే తరహాలో అభిమానులకు సహాయం చేస్తున్నారు. 200 మంది అభిమానులకు ఒక్కొక్కరికి 5000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేశారు. కష్ట కాలంలో అభిమానులకు హీరోలిద్దరూ ఇలా సహాయం చేయడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి హీరో తమ అభిమాన సంఘాల్లో ఉన్న అభిమానుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో వాకబు చేసి వారికి చేయూతను అందిస్తే ఎంతో బాగుంటుంది.  ఇలా చేయడం వలన అభిమానులకి కూడ తమ హీరోల పట్ల నమ్మకం, అభిమానం మరికాస్త పెరుగుతాయి.