“ఖైదీ” సీక్వెల్ పై అదిరే అప్డేట్ ఇచ్చిన హీరో కార్తీ.!

కోలీవుడ్ యువ స్టార్ హీరోస్ లో కార్తీ కూడా ఒకడు. అయితే కార్తీ హీరోగా నటించిన ఎన్నో చిత్రాల్లో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తో చేసిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “ఖైదీ” కోసం తెలుగు మరియు తమిళ ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమిళ్ లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అలాగే తెలుగులో కూడా అంతే రేంజ్ హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమా లాస్ట్ లో సినిమాకి సీక్వెల్ కూడా ఉందని రివీల్ చెయ్యగా అక్కడ నుంచి సినిమా రెండో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఉన్నటు. అయితే దర్శకుడు లోకేష్ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి తన యూనివర్స్ గా ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు తాజాగా కార్తీ అయితే తన సినిమా “సర్దార్” ప్రమోషన్స్ లో ఖైదీ సీక్వెల్ పై అదిరే అప్డేట్ ని ఇచ్చాడు.

ఈ సినిమాకి సీక్వెల్ ఉందని ఆల్రెడీ లోకేష్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసాడని అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది 2023లో చివరి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అయితే ఈ గ్యాప్ లో లోకేష్ మరో స్టార్ హీరో విజయ్ తో భారీ ఏక్షన్ సినిమా చేయనున్నాడు. దీని తర్వాత ఖైదీ 2 స్టార్ట్ అవుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఫస్ట్ పార్ట్ కి అయితే సామ్ సి ఎస్ సంగీతం అందించగా దీనికి అనిరుద్ ఇవ్వొచ్చని తెలుస్తుంది.