రాజకీయాల్లో అనుభవమే లేదు. మొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నారు.. కొత్త రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.. అంటూ దేశమంతా ముక్కున వేలేసుకుంది. జగన్ ముఖ్యమంత్రి అవుతుంటే ఏపీ పరిస్థితి ఏంటో అని అంతా అనుకున్నారు. కానీ.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు సీఎం జగన్. కొత్త రాష్ట్రమైనా.. కేంద్రం సహకరించకున్నా.. తన వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం దేశమంతా ఏపీ వైపు చూస్తోంది. ఏపీలోని పథకాలను తమ రాష్ట్రాల్లోనూ ప్రారంభించడాని.. అన్ని రాష్ట్రాలు సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే.. ఏపీకి వచ్చి.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, ఇక్కడ కొనసాగుతున్న పథకాల గురించి తెలుసుకుంటున్నారు.
తాజాగా.. కర్నాటక అధికారులు ఏపీలో అడుగుపెట్టారు. ఏపీలో ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాల గురించి తెలుసుకోవడం కోసం కర్నాటక అధికారుల బృందం ఏపీలో పర్యటించింది.
ఇద్దరు ఐఏఎస్ అధికారులతో పాటు.. మరో ఎనిమిది మంది ప్రభుత్వ అధికారులు అనంతపురం జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని సోమందెపల్లి, చిలమత్తూర్ మండలాల్లో పర్యటించారు. అక్కడ గ్రామస్థాయిలో పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకున్నారు.
ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న గ్రామ, వార్డు సచివాలయాలను కర్నాటకలోనూ ప్రారంభించడానికి కర్నాటక ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందులో భాగంగానే.. కర్నాటక అధికారులు ఏపీలో పర్యటించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఆ వ్యవస్థ ఏపీలో ఎలా నడుస్తుందో తెలుసుకున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల.. గ్రామాల్లోని అసలైన లబ్ధిదారులకు వాళ్ల ఇంటి వద్దకే ఫలాలు అందుతాయని.. ఈ వ్యవస్థ ఎంతో పారదర్శకంగా ఉందని కర్నాటక పంచాయత్ రాజ్ కమిషనర్ ప్రియాంక మేరీ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్ గురించి ఈ బృందం తెలుసుకుంది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అన్ని రకాల సేవలు అందడం కోసం రూపొందించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను కర్నాటక బృందం ఈసందర్భంగా కొనియాడింది.