కోర్టు ఎత్తివేసిన ‘స్టే’తో ఓటీటీలో ‘కాంతార’ గట్టెక్కినట్టేనా..?

చిన్న సినిమాగా విడుదలై పెను సంచలనం సృష్టించింది ‘కాంతార’. కన్నడ నుంచి నుంచి వచ్చిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లను కలెక్ట్‌ చేసింది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కోర్టు ఎత్తివేసిన ‘స్టే’తో ఓటీటీలో ‘కాంతార’ గట్టెక్కినట్టేనా?కి వచ్చేసింది. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్‌లో కూడా సంచలనం సృష్టిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఓటీటీలో సినిమా చూసిన వారందరూ సినిమాపై పెదవి విరుస్తున్నారు. దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్లైమాక్స్‌లో వచ్చే ‘వరాహరూపం’ పాటనే ‘కాంతార’ సినిమాకు ఊపిరి. కానీ, ఈ పాట లేకుండా వేరే ట్యూన్‌తో ఓటీటీలో సినిమాను విడుదల చేశారు. దీంతో సినిమా చూసిన వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్లంతా ఖుషీ అయ్యే వార్త ఒకటి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. ‘కాంతార’ విడుదలై మంచి టాక్‌తో ప్రభంజనం సృష్టిస్తున్న సమయంలో సినిమాకు వ్యతిరేకంగా కేరళలో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ సినిమాలోని ‘వరాహరూపం’ పాట కోసం తమ ట్యూన్‌ కాపీ చేశారని తెయ్యుకుడం బ్రిడ్జ్‌ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ కోర్టును ఆశ్రయించింది. హోంబలే ఫిలింస్‌పై కోజికోడ్‌ జిల్లా కోర్టులో కేసు వేసింది. దీంతో ఆ సాంగ్‌పై కోజికొడ్‌ జిల్లా న్యాయస్థానం స్టే విధించింది. ఆ తర్వాత ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ‘కాంతార’ చిత్ర బృందానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. మ్యూజిక్‌ బ్యాండ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు.. ‘వరాహరూపం’ పాటపై నిషేధం ఎత్తివేసింది. దీంతో ఈ పాటను తొందరలోనే ఓటీటీలో యాడ్‌ చేస్తారని ఫ్యాన్స్‌ అంతా ఖుషీ అవుతున్నారు. కానీ దానికి కొంత సమయం పట్టేలా ఉంది. దీనికి కారణం ‘వరాహరూపం’ సాంగ్‌పై కోజికోడ్‌ జిల్లా కోర్టుతో పాటు పాలక్కడ్‌ జిల్లా కోర్టులో కూడా పిటిషన్‌ దాఖలైంది. దీంతో అక్కడి న్యాయస్థానం కూడా పాటపై స్టే విధించింది. పాలక్కడ్‌ న్యాయస్థానం నుంచి కూడా సానుకూలంగా తీర్పు వస్తేనే ఈ ‘వరాహరూపం’ పాటను యాడ్‌ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.