Kannada Hero: రెట్రో లుక్‌లో ఉన్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా.. గుర్తు పట్టడం కష్టమే!

Kannada Hero: మామూలుగా నటీనటులు సినిమాల కోసం హెయిర్ స్టైల్స్ కాస్ట్యూమ్స్ ఇలా ప్రతి ఒక్కటి మార్చుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు బాడీ స్టైల్ ని కూడా మార్చేసుకుంటూ ఉంటారు. సినిమాలో పాత్రలకు తగ్గట్టు మారిపోతూ ఉంటారు. అలా ఒక హీరో ఇప్పుడు ఒక సినిమాకోసం గుర్తు పట్టలేని విధంగా మారిపోయారు. ఆ హీరోని తదేకంగా చూసినా కూడా గుర్తుపట్టడం కాస్త కష్టమే అని చెప్పాలి. అలా ఇప్పుడు పైన కనిపిస్తున్న స్టార్ హీరో ను గుర్తుపట్టారా? ఈయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం. ప్రస్తుతం ఈ స్టార్ హీరో జైలర్‌ మూవీ సీక్వెల్‌లో నటిస్తున్నారు.

అలాగే తెలుగులో రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమాలో పవర్‌ ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈపాటికే మీకు ఆయనెవరో అర్థమైపోయి ఉంటుంది. తనే కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 666 ఆపరేషన్‌ డ్రీమ్‌ థియేటర్‌. సప్త సాగరాలు దాటి ఫేమ్‌ హేమంత్‌ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో శివన్న ధనంజయగా కనిపించనున్నారు. పోస్టర్‌ లో ఆయన లుక్‌ గుర్తుపట్టలేకుండా ఉంది.

సూటూబూటూ వేసుకుని, టై కట్టుకుని ఒక చేతిలో రివాల్వర్‌ పట్టుకుని చాలా సీరియస్‌ గా కనిపిస్తున్నారు శివన్న. ఈ లుక్ లో శివ రాజ్ కుమార్ గుర్తు పట్టలేని విధంగా ఉన్నారు. పుష్ప విలన్‌ డాలి ధనంజయ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైశాక్‌ జె ఫిలింస్‌ బ్యానర్‌ పై డాక్టర్‌ వైశాక్‌ జె. గౌడ నిర్మిస్తున్నారు. అద్వైత గురుమూర్తి సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, చరణ్‌ రాజ్‌ సంగీతం అందిస్తున్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోస్ ని చూసేయండి.