కన్నడపై మెహ్రిన్ గురి!?

Mehreen Pirzada

మెహ్రిన్ పంజాబీ బ్యూటీ ఆయినప్పటికీ టాలీవుడ్ లోనే బాగా  అవకాశాలు దక్కించుకుంది.  ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో చక్కని నటన, హావభావలతో ఆకట్టుకున్న మెహ్రీన్ ..ఆ తరువాత చేతి నిండా సినిమాలతో బిజీగా మారింది.  అయితే, ఆఫర్లు అయితే అందుకుంది కానీ, మెహ్రీన్అందులో ఒక్కదాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయింది.. ఆ పాత్రల్లో ప్రతిభ చూపించకపోవడంతో ఆమె నటన జనాలకు తొందరగానే బోర్ కొట్టేసింది. ఇక ‘ఎఫ్ టు’ ఘనవిజయం సాధించినా..

అందులో ‘హనీ ఈజ్ ద బెస్ట్’, అంటూ మురిపించినా.. ఆమెకు పెద్దగా మార్కులు పడలేదు.ఆ తర్వాత నాపేరు సూర్య, జవాన్, పంతం, నోటా, కవచం, చాణక్య, ఎంతమంచి వాడవురా, అశ్వత్థామ వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతినడంతో  మెహ్రిన్ పూర్తిగా డీలా పడిపోయింది. ఆమెకి భవిష్యత్తే ఆశాజనకంగా కనిపించలేదట.

ఇక తమిళంలోనూ అదృష్టం పరీక్షించుకుంది కానీ, అక్కడా ఫలించలేదు .  టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమెకు ఒక్క ఆఫర్ కూడా లేదు. దీంతో ఆమె కన్నడ చిత్రసీమకు పయనమైందని సమాచారం. కన్నడ నాట నుంచి పిలుపు అందుకోవడంతో ఇప్పుడు అటువైపు దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది మెహ్రీన్.