ఇండస్ట్రీ టాక్ : “కాంతారా” ఓటిటి విడుదల ఎప్పుడు నుంచి అంటే.?

తాజాగా పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ సినిమా “కాంతారా” కోసం తెలియని వాళ్ళు అయితే ఉండరు. గరుడ గమన వృషభ వాహన ఫేమ్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా అలాగే తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. ఇప్పుడు వసూళ్ల పరంగా 250 కోట్ల మార్క్ కి వెళ్తున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కి సంబంధించి అయితే అప్డేట్ కూడా వినిపిస్తుంది.

నిన్న అయితే చిత్ర మేకర్స్ నవంబర్ లో రిలీజ్ లేదని తప్పుడు వార్తలు ఖండించారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ కాంతారా ఓటిటి డెబ్యూ పై వినిపిస్తుంది. ఈ చిత్రం బహుశా డిసెంబర్ రెండో వారం లోపు నుంచి ఓటిటి లో అందుబాటులోకి ఉంటుంది అని తెలుస్తుంది.

అయితే ఈ సినిమాని ప్రముఖ ఓటిటి సంస్థ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి అందులో అయితే అప్పుడు నుంచి ఈ చిత్రం స్ట్రీమ్ కానున్నట్టుగా టాక్. ఇక ఈ సినిమాలో అయితే సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. అలాగే విక్రాంత్ రోనా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాద్ సంగీతం అందించాడు. అలాగే కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.