ఆ క్షణాన్ని ఎంజాయ్ చెయ్ అంటూ కమల్ ట్వీట్.. వైరల్ అవుతున్న పోస్ట్…!

ప్రముఖ కోలీవుడ్ నటుడు సూర్య ఇటీవల ఒక అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. సినీ తారలందరూ ఎంతో ఆతృత గా ఎదురుచూసే ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమానికి హీరో సూర్యకి ఆహ్వానం దక్కింది. నటీనటులందరూ ఈ ఆస్కార్ అవార్డ్ అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తారు. అంతే కాకుండా ఈ ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులుగా అవకాశం పొందటం కూడా ఎంతో గౌరవంగా భావిస్తారు. 2022 లో జరిగే ఈ ఆస్కార్ అవార్డ్ కార్యక్రమానికి సంబంధించి 397 మంది సినీ ప్రముఖులను ఆర్గనైజింగ్‌ కమిటీకి ఎంపిక చేశారు. తమిళ ఇండస్ట్రీ నుండి మొదటిసారిగా సూర్య ఈ కమిటీలో స్థానం దక్కించుకున్నాడు.

దీంతో సూర్య తో పాటు ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యకి ఈ అవకాశం దక్కటంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటారు. ఇక ఈ విషయం గురించి పలువురు సినీ ప్రముఖులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సూర్య కి అభినందనలు తెలియచేస్తున్నారు. ఈ క్రమంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ సూర్య కి అభినందనలు తెలిపారు. ఈ మేరకు కమల్ హాసన్.. “నా తమ్ముడు ఈ అవకాశం పొందినందుకు చాలా గర్వంగా ఉంది . జస్ట్ ఆ మూమెంట్ ని ప్రౌడ్ గా ఎంజాయ్ చెయ్యి” అంటు సూర్యకి సూచిస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ ఆస్కార్ వేడుకలకు ఇండియా నుండి సూర్య తో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు కాజోల్‌, నిర్మాత ఆదిత్య సూద్, దర్శకురాలు రీమా కగ్తి, సుస్మితా ఘోష్‌, రీంతు థామస్‌ కూడా ఎంపికయ్యారు. అయితే సౌత్ ఇండస్ట్రీ నుండి హీరో సూర్య ఒక్కరే ఎంపిక కావడం విశేషం. అయితే సూర్య నటించిన “ఆకాశం నీ
హద్దురా ” సినిమా భారత్‌ నుంచి 93వ ఆస్కార్‌కు అధికారిక ఎంట్రీగా వెళ్లగా, ‘జై భీమ్‌’ సినిమా 94వ ఆస్కార్‌ షార్ట్‌ లిస్టులో ఎంపిక కాలేదు. మొత్తానికి నార్త్ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి ఎంపికైన మొదటి వ్యక్తిగా సూర్య రికార్డ్ క్రియేట్ చేశాడు.