చిరంజీవి తమిళంలో రాణించలేకపోవడానికి కారణం ఆయన చేసిన ఆ తప్పే: కమల్ హాసన్

లోకనాయకుడు కమల్ హాసన్ చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకొని భారీ కలెక్షన్లను రాబడుతోంది. చాలా సంవత్సరాల నుంచి కమల్ హాసన్ సినిమా కోసం ఎదురు చూసిన అభిమానులకు ఈ సినిమా పెద్దఎత్తున సందడి చేస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా కమల్ హాసన్ పాన్ ఇండియా సినిమాలు గురించి ప్రస్తావిస్తూ ఇండియా సినిమాలను అప్పట్లోనే ఎంతో మంది హీరోలు వారి చిత్రాలను వివిధ భాషలలో నటించారని తెలియజేశారు.ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ చాలామంది మెగాస్టార్ చిరంజీవి సినిమాలు తమిళంలో పెద్దగా ప్రేక్షకులు ఆదరించలేదు అని చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదు. మెగాస్టార్ చిరంజీవికి తమిళంలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తనకు తెలుగులో మరింత ఎక్కువగా అభిమానులు ఉండడంతో ఆయన తెలుగులోనే సినిమాలు చేశారు.

చిరంజీవి విధంగా తెలుగు సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల తమిళంలో స్టార్ కాలేకపోయారు. చిరంజీవి చేసిన ఈ తప్పు కారణం వల్లే ఆయన తమిళ ఇండస్ట్రీలో స్టార్ కాలేదు.అయితే ఇప్పటికీ ఆయనకు తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులు ఉన్నారని కమల్ హాసన్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇకపోతే విక్రమ్ సినిమా విషయానికి వస్తే రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.