నీ ప్రేమతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొంటా…కల్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్!

మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మడు ఏదో ఒకరకంగా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గత కొంతకాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ నుండి దూరంగా ఉందని తొందరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక పాప పుట్టిన కొంత కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్ధలు కారణంగా అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ దేవ్ ని శ్రీజ రెండో వివాహం చేసుకుంది. కళ్యాణ్ దేవ్ తో కూడా కొంత కాలం సంతోషంగా ఉన్న శ్రీజ ఇప్పుడు అతనితో కలసి ఉండటం లేదని సమాచారం. వీరికి ఒక పాప కూడా ఉంది.

అయితే తొందర్లోనే కళ్యాణ్ దేవ్, శ్రీజ విడాకులు తీసుకోనున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొదట శ్రీజ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో ఈ వార్తలు మొదలయ్యాయి. అంతే కాకుండా గత కొంత కాలంగా మెగా కుటుంబంలో జరిగే వేడుకలలో కళ్యాణ్ దేవ్ కనిపించటం లేదు. గతంలో కళ్యాణ్ దేవ్ సినిమా ప్రమోషన్స్ లో కూడా మెగా ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారని వస్తున్నా వార్తలు మరింత బలం అయ్యాయి. అయితే ఈ వార్తల గురించి ఇటు కళ్యాణ్ దేవ్ కానీ అటు మెగా కుటుంబం కానీ ఎవరూ స్పందించటం లేదు. వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవటంతో వీరిద్దరూ ఏ పోస్ట్ పెట్టినా కూడా వైరల్ గా మారుతోంది.

ఇటీవల శ్రీజ పెద్ద కూతురు పుట్టిన రోజు సందర్భంగా కళ్యాణ్ దేవ్ విషెస్ చెప్పకపోవడంతో ఆ వార్త వైరల్ గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ పెట్టిన ఒక పోస్ట్ కూడా వైరల్ గా మారింది. కళ్యాణ్ దేవ్ తల్లి పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ” జీవితం ఒక్కోసారి ఎంతో కష్టతరంగా మారుతుంది.. కానీ నీ ప్రేమ వల్ల వచ్చే శక్తితో వాటిని ఎదుర్కొంటానని నాకు నమ్మకం ఉంది. అన్ని వేళలా నాకు నీ సపోర్టు నిలుస్తున్నందుకు థాంక్యూ అమ్మ ” అంటూ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.