కల్వకుంట్ల కవిత.. సీఎం కేసీఆర్ కూతురు అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రి కాలేదు. తన అన్న కేటీఆర్ మాత్రమే మంత్రి అయ్యారు. కవిత.. 2019 వరకు నిజామాబాద్ ఎంపీగా చేశారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అప్పటి నుంచి కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నట్టుగా కనిపించారు.
కానీ.. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు అదే నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవలే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత.. తదుపరి కర్తవ్యం ఏంటి? అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న.
నిజానికి.. కవిత ఎమ్మెల్సీ అయింది.. కేవలం ఎమ్మెల్సీగానే ఉండటానికి కాదు. ఆమెను గెలిపించేందుకు.. సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారు. దానికి కారణం ఆమెను మంత్రిని చేయడమే. ఇప్పటి వరకు తనను ఒక్కసారి కూడా మంత్రిని చేయకపోవడంతో.. ఈసారి ఎలాగైనా కవితను మంత్రిని చేయాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నారట.
ఆమెకు కోరిన, తగిన మంత్రి పదవి రావాలన్నా.. ఆ స్థానంలో వేరు మంత్రి ఉన్నా.. ఆ మంత్రులు తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏ శాఖ కావాలన్నా.. ఆ శాఖ మంత్రి తప్పుకోవడానికి రెడీగా ఉన్నారట.
అయితే.. కవిత మంత్రి అవ్వడంలో తప్పే లేదని.. గతంలో ఎంపీగా చేసినప్పుడు పార్లమెంట్ లో తెలంగాణ నిధుల విషయంలో కేంద్రంతో కొట్లాడారని.. మంచి వక్త అని.. తెలంగాణ గురించి అంతా తెలుసు కాబట్టి.. తను మంత్రి అయితే తెలంగాణకు ప్లస్ పాయింటే కానీ.. మైనస్ కాదనేది కొందరి భావన. ఏది ఏమైనా.. కవితను ఎలాగైనా త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు కేసీఆర్ కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.