Naga Aswin: టాలీవుడ్ పాన్ ఇండియా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగ్ అశ్విన్ చివరగా ప్రభాస్ చివరగా నటించిన కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దేశవ్యాప్తంగానే కాకుండా ఆ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లను రాబట్టింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో బాగా సక్సెస్ అయింది. అయితే కల్కి పెద్ద కథ కావడంతో దీన్ని ఒక సినిమాలో చెప్పలేకపోయారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
దాంతో కల్కి మూవీని రెండు భాగాలుగా విభజించాడు. కల్కి మొదటి భాగం మంచి సక్సెస్ అవడంతో కల్కి సీక్వెల్ పై ఇప్పుడు అందరి కన్ను పడింది. అంతేకాకుండా కల్కి 2 పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందులో భాగంగానే కల్కి2 స్క్రిప్ట్ ను ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. నిజానికి కల్కి సినిమా సీక్వెల్ ను ఈ ఏడాది మొదలు పెట్టాలని ముందుగా నాగ్ అశ్విన్ అనుకున్నప్పటికీ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కల్కి సీక్వెల్ వాయిదా పడింది. సినిమాను ఈ ఇయర్ సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో నాగ్ అశ్విన్ దానికి అనుగుణంగా అందులో కీలక పాత్రలు చేయనున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె డేట్స్ ను అడగ్గా, వారు కూడా తమ డేట్స్ ను కేటాయించారు.
కానీ మెయిన్ లీడ్ అయిన ప్రభాస్ మాత్రం నాగ్ అశ్విన్ కు ఇంకా డేట్స్ ఇవ్వలేదు. ప్రభాస్ కల్కి2 సెట్స్ లో జాయిన్ అవాలంటే దాని కంటే ముందే తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది. ప్రభాస్ కు మధ్యలో గాయం అవకుండా ఉంటే అన్నీ అనుకున్నట్టే జరిగేవి. కానీ ప్రభాస్ మధ్యలో రెస్ట్ తీసుకోవడంతో అన్ని సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ పరిస్థితులన్నీ చూసి అయోమయంలో పడ్డ నాగ్ అశ్విన్, ప్రస్తుతానికి కల్కి సీక్వెల్ ప్లాన్స్ ను హోల్డ్ లో పెట్టి మరో రెండు కొత్త స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. కల్కి2 కోసం ప్రభాస్ ఎప్పుడైతే బల్క్ లో డేట్స్ కేటాయిస్తాడో అప్పుడే కమల్, అమితాబ్, దీపికాల డేట్స్ ను కూడా అడిగి అంతా ఓకే అనుకున్న తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడట. దీంతో కల్కి సినిమా అనుకున్న దాని కంటే ఇంకా కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.