కళాపురం మూవీ రివ్యూ

నటీనటులు: సత్యం రాజేష్, సంచిత పూనాచ, కాశీమ రఫీ, చిత్రం శీను, ప్రవీణ్ యెండమూరి, జనార్దన్
దర్శకత్వం : కరుణ కుమార్
నిర్మాతలు: జీ స్టూడియోస్ & R4 ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీత దర్శకుడు: మణి శర్మ

ఈ మధ్య తెలుగు లో గ్రామ నేపధ్యం లో సినిమాలు తరచూ వస్తూ ఉన్నాయి. ‘పలాస’ సినిమాతో తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఆ తర్వాత సుధీర్ బాబు తో ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా తీసాడు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు తాజాగా సత్యం రాజేష్ హీరో గా ‘కళాపురం’ అనే సినిమా తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

సత్యం రాజేష్ మంచి నటుడు, కానీ ఎందుకో అతనికి సరైన బ్రేక్ ఇంకా రాలేదు. ఇంతకముందు హీరోగా ‘విశ్వామిత్ర’ అనే సినిమాలో నటించాడు. ఇప్పుడు మరోసారి ‘కళాపురం’ సినిమా తో తన లక్ చెక్ చేసుకున్నాడు.

కథ:

కుమార్ (సత్యం రాజేష్) ఒక అసిస్టెంట్ డైరెక్టర్. తాను ఎప్పటికైనా గొప్ప దర్శకుడు అవ్వాలని కళలు కంటూ ఉంటాడు, దాని కోసం తీవ్రం గా శ్రమిస్తాడు. దర్శకుడు అవ్వడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. తన స్నేహితుడు ప్రవీణ్ (ప్రవీణ్ యండమూరి)తో కలిసి హైదరాబాద్‌లో ఉంటాడు. కుమార్ లవర్ ఇందు (కాశిమా రఫి) కూడా హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే అవకాశాల కోసం పక్కదారి పట్టి కుమార్‌ను, అతని ప్రేమను వదిలి వెళ్లిపోతుంది. ఒక వైపు దర్శకుడు కాలేకపోయానన్న బాధ, ఇంకో వైపు ప్రేమించిన అమ్మాయి మోసం చెయ్యడంతో  కుమార్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఇంకా సినిమా ఇండస్ట్రీ ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో.. అనుకోకుండా అప్పారావు అనే ఓ నిర్మాత పరిచయం అవుతాడు. అతడి వల్ల కళాపురం అనే ఊరికి వెళ్తాడు. అక్కడ కుమార్ ఒక స్కాం లో ఇరుక్కుంటాడు. తన సమస్యలను అధిగమించి తాను డైరెక్టర్ కావాలన్న కళను నెరవేర్చుకుంటాడా, లేదా అన్నది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్:

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కష్టాలను బేస్ చేసుకుని దర్శకుడు ఈ సినిమాను నడిపాడు. ఫస్ట్ హాఫ్ లో మంచి సన్నివేశాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న దర్శకుడు పరిశ్రమలో సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు, ప్రేమలో ఎలా మోసపోతాడు అనే విషయాలను చాలా బాగా చూపించారు. ఇలాంటి సినిమా కష్టాల్ని పూరి జగన్నాధ్ ‘నేనింతే’ సినిమాలో, అవకాశాల కోసం అమ్మాయిలు ఎలా మారిపోతారనేది 20 ఏళ్ళ క్రితమే  ‘ఖడ్గం’ సినిమా  లో చూపించాడు కృష్ణవంశీ.

మైనస్ పాయింట్స్:

మొదటి సగం బాగున్నా, సెకండాఫ్‌లో సీరియస్‌నెస్‌ లేకపోవడంతో కథనం అంతగా ఆకట్టుకోదు. సెకండ్ హాఫ్ లో అనుకోని ఒక ట్విస్ట్ ఉంటుంది, కానీ దానిని ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా సిలీగా అనిపిస్తుంది.

తీర్పు;

తన రెండు సినిమాలు ఎంతో సీరియస్ గా తీసిన కరుణ కుమార్, ఈ సినిమాలో మాత్రం అంత సీరియస్నెస్ చూపించలేదు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. కరుణ కుమార్ రాసుకున్న కథ బాగానే ఉన్నా.. తీసిన విధానం అంతగా ఆకట్టుకోలేదు.

సీన్‌ని కళాపురం లోకి మార్చిన విధానం, పాత్రలను పరిచయం చేసిన విధానం కూడా బాగుంది. కన్నింగ్ ప్రొడ్యూసర్‌గా నటించిన జనార్ధన్ తన పాత్రలో చాలా బాగా చేశాడు. ప్రదీప్ రుద్ర ఈ చిత్రంలో చిన్న పాత్ర చేసినా, చాలా డీసెంట్ గా చేశారు. సెకండాఫ్‌లో, టీమ్ ఎలా సినిమా చేయడానికి ప్రయత్నిస్తుందో కొన్ని కామెడీ సన్నివేశాలను చక్కగా హ్యాండిల్ చేశారు.