ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఆశీసులతో సాయి లక్ష్మీ గణపతి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సత్యం రాజేష్, శ్రవణ్ , కాలకేయ ప్రభాకర్ , ముకేష్ గుప్త ప్రధాన పాత్రల్లో. ఎన్. కె దర్శకత్వంలో గ్రంధి త్రినాధ్ ప్రొడ్యూసర్ గా లోతేటి కృష్ణ కో ప్రొడ్యూసర్ గా సుహాన హీరోయిన్ గా వచ్చిన చిత్రం ‘పాడేరు 12వ మైలు’.
రచన దర్శకుడు సంగీతం : ఎన్. కె
నిర్మాత : గ్రంధి త్రినాథ్
కో ప్రొడ్యూసర్ : లోతేటి కృష్ణ
నేపథ్య సంగీతం : పి ఆర్
సినిమాటోగ్రాఫర్ : జి. అమర్
ఎడిటర్ : శివ శర్వాని
కథ: హీరోయిన్ సుహనా ఒక కిల్లర్ కి సుపారీ ఇచ్చి ఒక వ్యక్తి నీ చంపమని చెబుతుండటం తో కథ మొదలవుతుంది. ఇంతలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ శ్రవణ్ పాడేరు 12వ మైలు రాయి కోసం వెతుకుతూ ఉంటాడు అలాగ్ కాలకేయ ప్రభాకర్ కూడా పాడేరు 12వ మైలు కోసం వెతుకుతూ ఉంటాడు, అలా అనుకోని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో సత్యం రాజేష్ కనిపిస్తాడు. అసలు సుహన ఎవర్ని చంపాలి అనుకుంటుంది .. శ్రవణ్ కి పాడేరు 12వ మైలు రాయి దొరికిందా ? అసలు ఫారెస్ట్ రేంజర్ ఆఫీసీర్ శ్రవణ్ కు కాలకేయ ప్రభాకర్ కి సత్యం రాజేష్ కి ఏంటి సంబంధం ? తెలుసుకోవాలంటే రివ్యూ లో చూద్దాం.
ప్లస్ పాయింట్స్: పాడేరు నేపథ్యంలో మొదలయ్యే ఈ సినిమా … ఒక మిస్టరీ గా స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరాసిటీ తో సాగుతుంది .. కొత్త అమ్మాయి సుహన చాలా బాగా యాక్ట్ చేసింది.. కొండయ్య పాత్రలో సత్యం రాజేష్ జీవించాడు అనే చెప్పాలి, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంది, డైరెక్టర్ ఎన్. కె చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో రాసుకున్న ఈ కథకు కాలకేయ ప్రభాకర్, రేంజర్ శ్రవణ్ అన్ని పాత్రలు డీ అంటే ఢీ గా ఉన్నాయి… పాడేరు లో అమ్మవారి గురించి చెప్పే సీన్స్ ప్రి క్లైమాక్స్ అండ్ క్లైమాక్ అయితే కోడి రామకృష్ణ అమ్మోరు సినిమా రేంజ్ లో ఉన్నాయి..
సాంకేతిక వర్గం: ఈ సినిమా లో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయి. ప్రొడ్యూసర్ గ్రంథి త్రినాథ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ని నిర్మాణం వహించారు. G. అమర్ ఇచ్చిన కెమెరా విజువల్స్ బాగున్నాయి. అలాగే పి.ఆర్ సంగీతం బాగుంది. శివ శర్వాని ఎడిటింగ్ బాగుంది…. పాటలు కూడా బానే ఉన్నాయి
పల్లెటూరి సెటప్ ఫ్రెష్ ఫీలింగ్ నీ తీసుకొచ్చింది సినిమా కి.. పాడేరు ఊరు బాగా చూపించారు
ఇక దర్శకుడు ఎన్. కె కథ నీ కరెక్ట్ గా చెప్పాడు ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ అండ్ సస్పెన్స్ సెకండ్ ఆఫ్ లో పాడేరు 12వ మైలు రాయి దగ్గర ఏం జరుగుతుంది ? ఎందుకు జరుగుతుంది ? అసలు పాడేరు 12వ మైలు రాయి కింద ఏముంది ? అనేది తెరమీద బాగా చూపించారు. చివర్లో గ్రాఫిక్స్ వర్క్ కూడా బాగుంది …. ఒక పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సినిమా మస్ట్ వాచ్ అని చెప్పవచ్చు. లీడ్ నటీనటులు బాగా చేశారు… మీకు ఒక కోడి రామకృష్ణ అమ్మోరు అంజి అరుంధతి సినిమాల ఫీల్ రావాలంటే పాడేరు 12వ మైలు చూడాల్సిందే.
రేటింగ్: 3/5