బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలు కాలేదు.. అవకాశాల కోసం వేట మొదలు పెట్టిన కాజల్!

వెండితెర చందమామ కాజల్ అగర్వాల్ దాదాపు పుష్కరకాలం కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి బిజీ బిజీగా గడిపారు. ఇకపోతే ఈమె 2020 వ సంవత్సరంలో తన ప్రియుడు గౌతమ్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే గత ఏడాది ఈమె గర్భవతి కావడంతో కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకున్నారు.ఇక కాజల్ అగర్వాల్ ఈ ఏడాది ఏప్రిల్ 19వ తేదీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ బిడ్డకు నీల్ కిచ్లు అని పేరు పెట్టారు.ఈ క్రమంలోనే తన బిడ్డకు సంబంధించిన ఫోటోలను కూడా కాజల్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే కాజల్ అగర్వాల్ డెలివరీ అయిన తర్వాత అందమైన క్యూట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈమె అందంలో ఏ మాత్రం మార్పులు రాలేదని ఈమె షేర్ చేస్తున్న ఫోటోలను చూస్తుంటే తెలుస్తోంది.ఇకపోతే కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకుండానే అప్పుడే సినిమా అవకాశాల వేటలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ ఈమె తన ఫోటో షూట్ లతో చెప్పకనే చెప్పేశారు.

ఇక కాజల్ అగర్వాల్ అవకాశాల కోసం తన మేనేజర్లు ప్రముఖ ఓటీటీ సంస్థలు, ప్రొడక్షన్ హౌస్ చుట్టూ చక్కర్లు కొడుతూ కాజల్ అగర్వాల్ కి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ కి అనుగుణంగా పాత్రలు దొరికితే నటించడానికి తాను సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఇదివరకు హీరోయిన్లు పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టగానే పూర్తిగా ఇండస్ట్రీకి దూరమై వారి వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితమయ్యే వారు. అయితే కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్ పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇండస్ట్రీలో అగ్ర తారలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే వీరి బాటలో కాజల్ అగర్వాల్ కూడా పెళ్లయి పిల్లలు పుట్టిన కూడా ఇండస్ట్రీలో కొనసాగాలని ప్రయత్నాలు చేస్తున్నారట.