వెండితెర చందమామగా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకు దూరమయ్యారు. కాజల్ అగర్వాల్ గత నెల 19వ తేదీ పండంటి బిడ్డకు జన్మనివ్వడం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యం తన కొడుకుకు సంబంధించి విషయాలను చెబుతూ కాజల్ అగర్వాల్ ఎమోషనల్ పోస్ట్ లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కాజల్ తన కొడుకు పై ప్రేమను తెలియజేస్తూ ఇదివరకే ఎన్నో పోస్ట్ లు చేశారు. తాజాగా కాజల్ అగర్వాల్ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా మనసును హత్తుకునే పోస్ట్ చేస్తూ అభిమానులను సందడి చేశారు.
ఈ క్రమంలోనే కాజల్ భర్త గౌతమ్ కిచ్లు తండ్రిగా తన కొడుకు పట్ల ఎంతో బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తన కొడుకుని భుజంపై ఎత్తుకొని తనని జోకొడుతూ నిద్ర పుచ్చాడు. ఇలా తన కొడుకును జోకొడుతూ గౌతమ్ కూడా నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పాపా డ్యూటీస్ ట్యాగ్ లైన్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాజల్ అగర్వాల్ 2020 వ సంవత్సరం అక్టోబర్ నెలలో తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత కాజల్ అగర్వాల్ పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ తను ప్రెగ్నెంట్ కావడంతో తన కమిట్ అయిన సినిమాల నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలోనే తన బేబీ బంప్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ మాతృత్వాన్ని ఎంతో ఎంజాయ్ చేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన కొడుకుకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.