కాజల్ అగర్వాల్ ఇంత పెద్ద తప్పు చేసేసిందేంటీ.?

 

స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న కాజల్ అగర్వాల్ ఇటీవల పెళ్ళి చేసుకున్న విషయం విదితమే. ఇటీవల తమ వైవాహిక బంధానికి ఏడాది పూర్తయ్యిందంటూ కాజల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది కూడా. పెళ్ళయినా, సినిమాల్లో కొనసాగుతున్న కాజల్ ఇప్పుడు తాజాగా వివాదాల్లోకెక్కింది.

ఓ మద్యం బ్రాండుకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది కాజల్ అగర్వాల్ జంట. ఇదెక్కడి వింత.? అనుకునేరు. ఆయా మద్యం బ్రాండ్లను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కొత్తేమీ కాదు. అయితే, నేరుగా చేయరు. పరోక్షంగా చేస్తుంటారు. కానీ, కాజల్ అయితే, నేరుగానే ప్రమోట్ చేసింది.

టేబుల్ మీద మద్యం బాటిల్.. చేతిలో ప్లేయింగ్ కార్డ్స్.. ఇలా వుంది కాజల్ జంట వ్యవహారం. 25 ఏళ్ళ పైబడినవారికి మాత్రమే.. అంటూ సదరు మద్యం బ్రాండ్‌ని ప్రమోట్ చేశారు కాజల్, ఆమె భర్త. ఈ వైనాన్ని ఆమె గొప్పగా సోషల్ మీడియాలో కూడా పెట్టుకుంది.

డబ్బు కోసం మరీ ఇంతలా దిగజారాలా.? అని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు కాజల్ దంపతుల్ని.