Kaikala Satyanarayana: కైకాల జీవితంలో నమ్మలేని..ఊహించని నిజాలు..ఇవే?

Kaikala Satyanarayana: తెలుగు ఇండస్ట్రీలో నవరస నటనా సార్వభౌమగా పేరుపొందిన ప్రముఖ టాలీవుడ్ నటుడు కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వందల చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడుగా పేరు సంపాదించుకున్నారు.

ఇకపోతే ఈయన తెలుగులో ఎన్టీఆర్ నుంచి జూ. ఎన్టీఆర్ వరకు అందరి హీరోలతోనూ స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. తెలుగు తెరపై ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలతో విలక్షణమైన నటనతో నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్నారు కైకాల సత్యనారాయణ. మహానటుడు ఎస్వీరంగారావు వారసుడిగా పేరు తెచ్చుకున్న స్వర్ణ యుగ చరిత్రలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించుకున్న గొప్ప నటుడు సత్యనారాయణ. దాదాపు 6 దశాబ్దాల సినీ చరిత్రంలో 770 చిత్రాల్లో విభిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు కైకాల.

అంతేకాదు ఎన్నో పౌరాణిక, సామాజిక, సాంఘీక చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన అతి కొద్ది మంది నటుల్లో సత్యనారాయణ ఒకరు. చిన్నప్పటినుంచే నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాల్లో నటించారు. 1958లో సిపాయి కూతురు చిత్రంతో నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కెరీర్ ప్రారంభంలో ఎన్టీఆర్ డూప్‌గా కూడా నటించారు. దాదాపు 6 దశాబ్దాల సినీ చరిత్రలో 4 తరాల నటులతో నటించిన నటుడు కైకాల.

ఇదిలా ఉండగా 1996లో ఎన్టీఆర్ ప్రోద్భలంతో మచిలీపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2011లో ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్‌ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడులో మునియప్ప పాత్రలో నటించారు. చివరగా సత్యనారాయణ, కార్తీక్ రాజ్, మిస్తీ రాజు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ధీర్ఘాష్మాన్‌భవ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మరోసారి యముడి పాత్రతో కైకాల కనువిందు చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినా, విడుదలకు ఇంకా నోచుకోలేదు.