టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతో వేంగంగా ముందుకు కదులుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అప్ డేటెడ్ వెర్షన్ అందుబాటు లోకి వస్తోంది. సాంకేతికతను అందుకుంటూ అభివృద్ధిలోనూ ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా అంతే వేగంగా ముందుకు వెళ్తోంది. తాజాగా కెనడా మెట్రో రైలు పరుగులకు మనదేశ ట్యాలెంట్ అందులోనూ ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాయలసీమ ముద్దుబిడ్డ కడప జిల్లా వాసి కావడం ఇంకా విశేషం. కడప వాసి ట్యాలెంట్ తో- ట్రయోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ సంస్థ తయారు చేసిన విడిభాగాలలో కెనడా, అమెరికా, ప్రాన్స్ , ఆస్ర్టేలియా సహా పలు దేశాల మెట్రో రైళ్లు కూత పెడుతున్నాయి.
ఆ దేశాల మెట్రో విడిభాగాలకు అవసరమైన డిజైన్లు తయారు చేయడం కోసం విదేశీ టెక్నాలజీ ని అందిపుచ్చుకుని తమదైన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రపంచ దేశాలే తమ పరికరాల కోసం ఎదురుచూసేలా ట్రయోవిజన్ కాంపోజిట్ ముందుకు కదులుతోంది. ఈ సంస్థ ఎండీ పేరు నందర్ నెడ్డి. కడపజిల్లా వాసి. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఉద్యోగ రీత్యా పలు ప్రయివేటు కంపెనీల్లో దేశవిదేశాల్లో పనిచేసారు. ఈ క్రమంలోనే ఆస్ర్టియాలో ఎమ్మెస్ చేసారు. అక్కడే కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేసారు. విధుల్లో భాగంగా జపాన్, చైనా, ఐరాపా దేశాలు తిరిగారు. ఈక్రమంలోనే మెట్రో రైలు టెక్నాలిజీ గురించి తెలుసుకున్నారు.
ఈ అనుభవంతో సొంతంగా కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం కొప్పర్తి పారిశ్రామిక వాడలో 2016లో ట్రయోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీ పరిశ్రమని ప్రారంభించారు. 9 కోట్లతో పెట్టుబడితో దీన్ని స్థాపించారు. ట్రాపిక్ బూతులు, విండ్ మిల్ యంత్రాల రెక్కలు, జారుడు బల్లలు, ఎలక్ర్టిక్ వాహనాలు, మెట్రో రైలు విడి భాగాలు లాంటి సాంకేతికను ఉపయోగించు కుంటూ ట్రయో విజన్ రూపొందిస్తుంది. ఇందులో కొందరి నందన్ స్నేహితుల ఆర్ధిక సహాకారం కూడా ఉంది. మొదటి ఏడాది టర్నోవర్ 5 లక్షలే. త ర్వాతి నాలుగేళ్లలో 20 కోట్ల టర్నోవర్ కు చేరుకుంది. పుణే, ముంబై, చెన్నై, సింగపూర్, అమెరికా ప్రాన్స్ లకు ప్రస్తుతo ట్రయోజనిక్ కి ఆర్డర్లు ఉన్నాయి.